in

*హోటళ్లు, స్వీట్‌ షాపులు, బేకరీలకు సమయం పెంచండి*

అధికారులకు హోటలియర్స్‌ అసోసియేషన వినతి*

మంగళగిరి పట్టణంలో హోటళ్లు, స్వీట్‌ షాపులు, బేకరీలకు సాయంత్రం ఏడు గంటల వరకు అనుమతి ఇవ్వాలని ది మంగళగిరి హోటల్స్‌, బేకరీ అండ్‌ స్వీట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన ప్రతినిధులు గురువారం అధికారులను కలిసి విన్నవించారు. లాక్‌డౌన వలన అన్ని వర్గాలతోపాటు హోటళ్లు, స్వీట్‌షాపులు, బేకరీ నిర్వాహకులు, అందులో పనిచేసే సిబ్బంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయని, సిబ్బందికి జీతాలు చెల్లించలేక, అద్దెలు కట్టలేక… నిర్వహణ కూడా భారంగా మారిందని పేర్కొన్నారు. మిగతా వ్యాపారాలతో పోలిస్తే ఆహార పదార్ధాలు నిల్వ వుండే పరిస్థితి వుండబోదని, భోజన విరామ సమయంలో దుకాణాలను మూసివేస్తే తీవ్రంగా నష్టపోవలసి వుంటుందని, హోటళ్లకు ఆ సమయంలోనే రద్దీ ఎక్కువగా వుంటుందని తెలిపారు. కరోనా నియంత్రణ కోసం అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లు, థర్మల్‌ స్ర్కీనింగ్‌, భౌతిక దూరం వంటి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని, తాము వ్యాపారాలు చేసుకునేందుకు సాయంత్రం ఏడు గంటల వరకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై అధికారులు సానుకూలంగా స్పందించారని, సాయంత్రం వరకు అవకాశం ఇచ్చేందుకు పరిశీలన చేస్తామని హామీని ఇచ్చినట్టు అసోసియేషన ప్రతినిధులు తెలిపారు. అధికారులను కలిసిన వారిలో అసోసియేషన అధ్యక్షులు కొమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం (నాని), ఇతర సభ్యులు వున్నారు.

What do you think?

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

0

అమరావతే రాజధానిగా ఉండాలి: రఘురామకృష్ణరాజు